నేనేం చేస్తానంటే.. !

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నానో తెలుసా! నేను సంగీతం, షటిల్‌ రెండూ నేర్చుకోవాలనుకుంటున్నాను.

Published : 06 Jan 2022 00:57 IST

పెద్దలు చెప్పింది వింటా...

హాయ్‌ ఫ్రెండ్స్‌! నేను ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నానో తెలుసా! నేను సంగీతం, షటిల్‌ రెండూ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు పేపర్‌ క్రాఫ్ట్స్‌ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి అందులో మరింత సాధన చేసి, బోలెడన్ని క్రాఫ్ట్‌లు తయారు చేస్తాను. అన్నట్టు 2020లో కరోనా వైరస్‌ గురించి చెబుతూ ఓ వీడియో చేశాను. అలాగే ఇప్పుడు వస్తున్న ఒమిక్రాన్‌ గురించి కూడా వీడియో చేసి, నా స్నేహితులందరికీ దాని గురించి అవగాహన కల్పిస్తాను. పెద్దవాళ్లు చెప్పిన మాట వింటూ, బుద్ధిమంతుడిగా ఉంటాను.

- టి.వెంకట్‌ హితేష్‌, నాలుగో తరగతి, కడప


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని