logo

పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా వరుణ్‌తేజ్‌ ప్రచారం

జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్‌తేజ్‌ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి

Updated : 27 Apr 2024 07:12 IST

నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్‌తేజ్‌ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్‌ తెలిపారు. కాకినాడ జిల్లా చేబ్రోలులోని పవన్‌కల్యాణ్‌ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ ప్రచారానికి సంబంధించి రోడ్‌షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్‌షో ప్రారంభమై వన్నెపూడి మీదుగా సాగుతుందన్నారు. కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో సభలు నిర్వహిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని