తేడాలు కనుక్కోండి :

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 30 Jul 2022 00:21 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

కిందనున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. కనిపెట్టండి చూద్దాం.

1. త్వరగా దుకాణానికి వెళ్లి, అర కిలో దొండకాయలు దోరవి తీసుకురా..
2. అంతలా మిడిసిపడకు.. మధ్యలో వచ్చిన సిరి, మధ్యలోనే పోతుందని గుర్తుంచుకో..

3. తెల్ల పావురం.. శాంతికి చిహ్నమని తెలుసు కదా!  
4. మన జాతీయ చిహ్నం పైన.. ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది.

5. ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు.
6. తమ డిమాండ్లు తీర్చాలని.. వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు.


పొడుపు కథలు

1. చేతికి చిక్కదు.. కంటికి దొరకదు.. చెవులకు మాత్రమే అందుతుంది. ఏంటది?
2. కదల్లేదు.. ఎగరలేదు కానీ నదిని మాత్రం దాటగలదు. ఏమిటో?
3. బడి కాదు.. పిల్లలూ వెళ్లరు. గంట మాత్రం టంచనుగా మోగుతుంది. అదేంటో?






నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.గొడుగు పైభాగం 2.చేప 3.ఎలుక కాలు 4.మేఘం 5.పిల్లి కాలు 6.పిల్లి తోక

కనిపెట్టగలరా?: B (వాహనాల చక్రాల సంఖ్య ఆధారంగా..)
గజిబిజి బిజిగజి : 1.శాకాహారం 2.రుణమేళా 3.రంపచోడవరం 4.తరగతి 5.గసగసాలు 6.చెక్కభజన 7.సౌరకుటుంబం 8.కలకలం

పొడుపు కథలు : 1.శబ్దం 2.వంతెన 3.గడియారం  అంత్యాక్షరి: 1.పుస్తకం 2.కందిరీగ 3.గది 4.దిక్కులు
వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.రవి 2.సిరి 3.శాంతి 4.సత్య/జయ 5.పద్మ 6.దీక్ష



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని