పపువా... వందలాది భాషలు వారెవా!

పపువా న్యూగినియా ఒక దీవి. ప్రజలు 850 భాషలకు పైనే మాట్లాడుతారు. అంటే ప్రపంచ భాషల్లో పదో వంతు భాషలు మాట్లాడేది ఇక్కడే. అధికారిక భాష

Published : 01 May 2016 01:30 IST

పపువా... వందలాది భాషలు వారెవా!

* పపువా న్యూగినియా ఒక దీవి. ప్రజలు 850 భాషలకు పైనే మాట్లాడుతారు. అంటే ప్రపంచ భాషల్లో పదో వంతు భాషలు మాట్లాడేది ఇక్కడే. అధికారిక భాష ఆంగ్లమే అయినా ఎక్కువగా స్థానిక భాషలే చలామణిలో ఉంటాయి.


 

పపువా న్యూ గినియా

 
రాజధాని: పొర్ట్‌ మెర్సిబ్‌
జనాభా: 80,83,700
విస్తీర్ణం: 4,62,840 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ: పపువా న్యూ గినియా కినా(పీజీకే)

* పట్టణాల్లో ఉండేవారు కేవలం పద్దెనిమిది శాతం మందే.

* 1933 వరకు సముద్రపు గవ్వల్ని కరెన్సీగా వాడేవారు.

* ప్రపంచంలోనే తొలిసారిగా వ్యవసాయం చేసిన దేశాల్లో ఇదీ ఒకటి. సుమారు ఆరున్నర వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ పంటలు పండించిన ఆధారాలున్నాయి. ఇక్కడి ‘కుక్‌’ అనే వ్యవసాయ క్షేత్రం పురాతనమైనది. ప్రపంచ వారసత్వపు జాబితాలో చేర్చారు.

* ఇక్కడ బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ పక్షులతో పాటు 750కి పైగా ఇతర పక్షి జాతులున్నాయి.

* ప్రపంచంలోనే విషపూరితమైన పక్షి హుడెడ్‌ పితోహు ఈ ప్రాంతానికి చెందినదే.

 


చిన్నారి చేసిన జెండా:

 

బంగారు వర్ణంలో ఉండే ప్యారడైజ్‌ పక్షి బొమ్మ స్థానిక గిరిజనులకు చిహ్నం. 1971లో ఈ జెండాను 15 ఏళ్ల సుసాన్‌ అనే అమ్మాయి రూపొందించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని