Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 30 Apr 2024 21:00 IST

1. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకూ ప్రభుత్వ పథకాలు: చంద్రబాబు

బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్‌ కేసులో తీర్పు

11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్‌ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్‌ సన్నిహితుడు ఎన్‌.సునీల్‌రెడ్డి, కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషిల డిశ్చార్జి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్లనూ తోసిపుచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. గుజరాత్‌ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా?: రేవంత్‌

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ భాజపాతో పొత్తు పెట్టుకోబోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భారాసకు ఒక్క ఓటు వేసినా అది వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్‌ ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. గెలాక్సీ ఎస్‌23పై ₹20వేలు డిస్కౌంట్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ త్వరలో ప్రారంభం కానుంది. మే 3 నుంచి మే 9 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. అయితే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై అందించనున్న డిస్కౌంట్లు తాజాగా రివీల్‌ అయ్యాయి. ఈ జాబితాలో శాంసంగ్‌ ఎస్‌23, పోకో ఎక్స్‌6 ప్రో, నథింగ్‌, మోటో, ఐఫోన్‌ 14 వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘రాజ్యాంగాన్ని ఏ శక్తీ మార్చలేదు’.. అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

 రాజ్యాంగ మార్పుపై కొంతకాలంగా భాజపా- కాంగ్రెస్‌ల నడుమ మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి స్పందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షాపై విమర్శలు గుప్పించారు. మన రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. వివేకా హత్య తర్వాత అవినాష్‌.. జగన్‌కు ఫోన్‌ చేసి ఏం మాట్లాడారు?: సునీత

 వైఎస్సార్‌ వారసుడు జగన్‌ కానే కాదని వివేకా కుమార్తె సునీత అన్నారు. పులివెందుల ప్రజల్లో భయం నెలకొందని, మునుపటి స్వేచ్ఛ రావాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వివేకా హత్య జరిగిన రోజు పరిణామాలు, ఆ తర్వాత దర్యాప్తు తీరును పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీత వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ప్రకాశం జిల్లాను ఫార్మాహబ్‌గా చేస్తాం: నారా లోకేశ్‌

ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ‘‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతాం’’ అని లోకేశ్‌ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. జెఫ్‌ బెజోస్‌ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్‌ఫ్లిక్స్‌ ఛైర్మన్‌

వ్యాపార రంగంలో దూసుకెళ్లడమంటే అంత సులువైన విషయం కాదు. ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరిస్తూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలి. పోటీని తట్టుకొని, సమస్యల్ని పరిష్కరించుకుంటూ సామ్రాజ్యాన్ని నడిపించాలి. ఇలా కష్టాల్ని ఎదుర్కొని సంస్థలను విజయవంతమైన మార్గంలో తీసుకెళ్లిన వారిలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హేస్టింగ్స్‌ (Reed Hastings) కూడా ఒకరు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తెలంగాణలో డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. భాజపా ఎన్నికల ప్రచారంలో మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘‘ కాంగ్రెస్‌ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది’’ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!

కెనడాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్‌ డిపాజిట్‌ను భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త నిబంధన అమలుకు సిద్ధమైంది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు ఆఫ్‌-క్యాంపస్‌లో ఇక నుంచి వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని