ప్రకృతి ఒడిలో... మెట్ల దారిలో!

జలజల జారే జలపాతాలు. గలగల పారే నదులు. ఎత్తయిన కొండలు. పచ్చని చెట్లు. బోలెడు వింత జీవులు... ఇలాంటి ప్రకృతి వింతలన్నింటినీ ఒకే చోట చూడాలని ఉందా? మరైతే ఎక్కడో, ఎలాగో తెలుసుకుందామా? పూర్తిగా చెక్కతోనే ఏర్పాటు చేసిన ఈ మెట్ల దారిలో నడవడం చాలా ఉత్కంఠగా ఉంటుంది.

Published : 24 May 2016 00:44 IST

ప్రకృతి ఒడిలో... మెట్ల దారిలో!

  జలజల జారే జలపాతాలు. గలగల పారే నదులు. ఎత్తయిన కొండలు. పచ్చని చెట్లు. బోలెడు వింత జీవులు... ఇలాంటి ప్రకృతి వింతలన్నింటినీ ఒకే చోట చూడాలని ఉందా? మరైతే ఎక్కడో, ఎలాగో తెలుసుకుందామా?


 

పూర్తిగా చెక్కతోనే ఏర్పాటు చేసిన ఈ మెట్ల దారిలో నడవడం చాలా ఉత్కంఠగా ఉంటుంది.


 

పోర్చుగల్‌లోని అరౌక ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ కొండల మధ్య ప్రవహించే నదీతీరంలో పర్యటకుల కోసం భలే ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన ‘పైవా వాక్‌వేస్‌’ అనే మెట్ల దారి ద్వారా పరిసరాల్లోని అందాలను ఎలాంటి శ్రమ లేకుండానే చూసి రావచ్చు.


 


 

ఎనిమిది కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ మార్గం భలేగా ఉంటుంది. నదీతీరం వెంబడి నుంచి మొదలుకొని లోయల్లో తిరుగుతూ గజిబిజి వంపుల్లో పర్వతాలపై వరకూ సాగుతుంది.


 

గత సంవత్సరం దీన్ని ప్రారంభించారు. కొద్దిరోజులకే పర్యటకుల సంఖ్య బాగా పెరిగిపోయింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని