icon icon icon
icon icon icon

YS Bharathi: ఏపీ సీఎం జగన్‌ సతీమణి భారతికి చేదు అనుభవం

కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది.

Updated : 30 Apr 2024 17:41 IST

కడప, న్యూస్‌టుడే: ‘మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసుపుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటో ఎందుకు’ అని ముఖ్యమంత్రి జగన్‌ సతీమణి భారతిని కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు భాస్కరరెడ్డి నిలదీశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని.. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో పర్యటించారు.

గొర్లమందల కాలనీలో మాజీ సర్పంచి ఇంటి వద్దకు వెళ్లి వైకాపాకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు. ‘సీఎం జగన్‌ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదు’ అని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.16 వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదేనని.. దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు.  భాస్కరరెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img