Chandrayaan 3: అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్‌ 3.. ఎందుకంటే!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది.

Published : 30 Apr 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతమై చరిత్ర సృష్టించింది. అయితే, ప్రయోగం సమయంలో చోటుచేసుకున్న ఓ కీలక పరిణామాన్ని ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. అనుకున్న సమయం కంటే నాలుగు సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్‌ ప్రయోగించినట్లు పేర్కొంది. అంతరిక్ష శకలాలు, ఉపగ్రహాలతో ఢీకొనడాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

‘కక్ష్య మార్గంలో శిథిలాలు, ఉపగ్రహాల నుంచి ఢీకొట్టే ప్రమాదాన్ని నివారించేందుకు చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని నాలుగు సెకన్లు ఆలస్యంగా చేపట్టాల్సి వచ్చింది’ అని ఇండియన్‌ స్పేస్‌ సిచ్యుయేషనల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్టు (ISSAR) 2023లో పేర్కొంది. అంతరిక్ష పర్యావరణానికి సంబంధించి.. భవిష్యత్తు పరిణామాలు, బాహ్య అంతరిక్షంలో సురక్షిత, సుస్థిర కార్యకలాపాలకు ఎదురయ్యే సమస్యలను ఇందులో విశ్లేషించింది. అయితే, చంద్రయాన్‌- 3 ప్రయోగం కొనసాగినంత కాలం ఎటువంటి ఇతర శకలాలు, ఉపగ్రహాలు దీనికి అత్యంత సమీపంలో వచ్చినట్లు గుర్తించలేదని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు