PM Modi: పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!

పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.

Published : 30 Apr 2024 00:03 IST

బెంగళూరు: వివాహ ఆహ్వాన పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేరును ప్రస్తావించడం.. ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది. ఎన్నికల కోడ్‌ను పర్యవేక్షిస్తోన్న అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. కర్ణాటక (Karnataka)లోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ యువకుడు తన పెళ్లిపత్రికలో ‘‘ప్రధానిగా నరేంద్ర మోదీని మరోసారి గెలిపించడమే మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి’’ అని పేర్కొన్నాడు. ఇది గమనించిన వరుడి బంధువొకరు ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేశారు.

వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?

దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏప్రిల్‌ 14న పుత్తూరు తాలుకాలోని వరుడి నివాసానికి వెళ్లారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించానని అతడు తెలిపాడు. ప్రధాని మోదీపై అభిమానం, దేశం పట్ల బాధ్యతతోనే ఆ ట్యాగ్‌లైన్‌ పొందుపర్చినట్లు చెప్పాడు. అయినప్పటికీ.. ఎన్నికల అధికారులు ఏప్రిల్ 26న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఏప్రిల్ 18న అతడు వివాహబంధంలో అడుగుపెట్టాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. పత్రికలు ముద్రించిన ప్రెస్ యజమానిపైనా అధికారులు, పోలీసులు దృష్టిసారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని