నోటితో తిప్పాడు... రికార్డు కొట్టాడు!

కొంత మంది చూపుడు వేలుపై నిలబెట్టి బాల్‌ని గిర్రున తిప్పేస్తుండటం చూస్తుంటాం కదా.....

Published : 07 Jul 2017 02:09 IST

భలే రికార్డు!
నోటితో తిప్పాడు... రికార్డు కొట్టాడు!

కొంత మంది చూపుడు వేలుపై నిలబెట్టి బాల్‌ని గిర్రున తిప్పేస్తుండటం చూస్తుంటాం కదా. పంజాబ్‌కి చెందిన సందీప్‌ సింగ్‌ అనే అన్నయ్య మాత్రం దీన్ని చాలా విచిత్రంగా చేసి చూపాడు. మొదట తన చూపుడు వేలుతో బాస్కెట్‌బాల్‌ని తిప్పడం ప్రారంభించాడు. నోటితో టూత్‌బ్రష్‌ పట్టుకుని మెల్లగా ఆ తిరిగే బంతిని బ్రష్‌ మీదికి తెప్పించాడు. అస్సలు ముట్టుకోకుండానే బ్రష్‌పై దాన్ని దాదాపు 53 సెకెన్లపాటు తిరిగేలా చేశాడు. ఇంతసేపు ఇలా చేసింది ఈ అన్నయ్యేనంటూ గిన్నిస్‌బుక్‌ వాళ్లు రికార్డూ ఇచ్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని