రూపాయి మాయం చేస్తా!
మ్యాజిక్ చేయడాన్ని చూసి భలే ఆశ్చర్యపోతాం. మరి ఈసారి మనమే మన స్నేహితుల ముందు చేసి ఆశ్చర్యపరుద్దామా! అయితే నేనో మ్యాజిక్ నేర్పిస్తా. కిటుకూ చెబుతా. ఇక్కడున్న ఫొటోల్ని చూసి జాగ్రత్తగా చేయండి.
అబ్రకదబ్ర
రూపాయి మాయం చేస్తా!
మ్యాజిక్ చేయడాన్ని చూసి భలే ఆశ్చర్యపోతాం. మరి ఈసారి మనమే మన స్నేహితుల ముందు చేసి ఆశ్చర్యపరుద్దామా! అయితే నేనో మ్యాజిక్ నేర్పిస్తా. కిటుకూ చెబుతా. ఇక్కడున్న ఫొటోల్ని చూసి జాగ్రత్తగా చేయండి.
దీని కోసం ముందు ఓ దళసరి కాగితం, గాజు గ్లాసు, కత్తెర, జిగురు, రూపాయి బిళ్ల దగ్గర పెట్టుకున్నా.
* ఫొటోలో చూపించినట్లు గ్లాసు కింద రూపాయి పెట్టి మాయం చేస్తా. మళ్లీ తెప్పిస్తా. అలా ఎలా జరిగిందబ్బా అనిపిస్తుంది చూస్తుంటే. కిటుకు: అసలు విషయం చెప్పనా... ముందు గాజు గ్లాసు మూతి దగ్గర కిందున్న దళసరి కాగితం లాంటిదాన్నే గుండ్రంగా కత్తిరించుకుని అతికించుకున్నా. ఆ సంగతి తెలియకుండా చూసుకోవాలి. గ్లాసు బొర్లించి ఉంది కాబట్టి కనిపించదు. కిందున్న కాగితం, గ్లాసుకు అతికించుకున్న కాగితం ఒకే రంగు కాబట్టి ఆ విషయం చూసినవారికి అర్థం కాదు. కింద రూపాయి పెట్టి గ్లాసును నెమ్మదిగా దానిపైకి జరపగానే రూపాయి కనిపించదు. పక్కకు జరపగానే కనిపిస్తుంది. ఇదన్నమాట కిటుకు!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్