Jammu Kashmir: భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు

జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు.

Updated : 04 May 2024 21:19 IST

శ్రీనగర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్‌ జిల్లాలోని శశిధర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్‌ దౌత్యవేత్త..!

ఉన్నతాధికారులు ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. సమీపంలోని అటవీప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. 2023లో సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి. ఇదిలా ఉండగా.. పూంచ్‌ ప్రాంతం అనంతనాగ్‌- రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఇక్కడ పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని