Romeo OTT: ఓటీటీలో విజయ్‌ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 05 May 2024 00:04 IST

హైదరాబాద్: విజయ్‌ ఆంటోనీ కీలక పాత్రలో వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోమియో’. తెలుగులో ‘లవ్‌ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. మృణాళిని రవి కథానాయిక. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా తమిళ్‌లో మే 10వ తేదీ నుంచి ‘రోమియో’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. తెలుగులోనూ అదే రోజున ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

కథేంటంటే: అరవింద్‌ (విజయ్‌ ఆంటోని) మలేషియాలో కేఫ్‌ నడుపుతుంటాడు. అతన్ని తన చెల్లి తాలూకూ ఓ చేదు గతం వెంటాడుతుంటుంది. మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టేక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35 ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్‌ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేషియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అరవింద్‌.. అనుకోకుండా ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడతారు. కానీ, లీలాకు ఆ పెళ్లి అసలు ఇష్టముండదు. ఎందుకంటే సినిమా హీరోయిన్‌ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. అయితే ఆమె నటిగా మారడాన్ని అంగీకరించని తండ్రి అరవింద్‌తో వివాహం జరిపిస్తాడు. కానీ, పెళ్లైన మరుసటిరోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈక్రమంలోనే ఆమె అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అరవింద్‌ తన భార్య మనసు గెలుచుకునేందుకు ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకూ చేదు గతమేంటి? హీరోయిన్‌ అవ్వాలన్న లీలా లక్ష్యం నెరవేరిందా? లేదా? ఆమె ఆఖరికి అరవింద్‌ను భర్తగా అంగీకరించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని