రైళ్లు లేవ్... రోడ్లు కనపడవ్!
గ్రీన్లాండ్నేల ఎక్కడో గానీ కనిపించదు... భూమిలో మాత్రం బోలెడు రత్నాలు... వేలల్లోనే జనాభా ఉన్న ఆ దేశం ఏంటో ఎక్కువశాతం మంచుతో నిండి ఉండే దేశం గ్రీన్లాండ్. దీనిలో ఎనభై శాతానికిపైగా నేల మంచు దుప్పట్లోనే ఉంటుంది. భౌగోళికంగా చూస్తే ఉత్తర అమెరికా...
రైళ్లు లేవ్... రోడ్లు కనపడవ్!
గ్రీన్లాండ్నేల ఎక్కడో గానీ కనిపించదు... భూమిలో మాత్రం బోలెడు రత్నాలు... వేలల్లోనే జనాభా ఉన్న ఆ దేశం ఏంటో... దాని విశేషాలేంటో?
* దేశం: గ్రీన్లాండ్ |
ఎక్కువశాతం మంచుతో నిండి ఉండే దేశం గ్రీన్లాండ్. దీనిలో ఎనభై శాతానికిపైగా నేల మంచు దుప్పట్లోనే ఉంటుంది. |
పడవల్లోనే ప్రయాణం!
* మంచుతో కప్పి ఉండటంతో ఈ దేశంలో రైల్వే వ్యవస్థే లేదు. ఎక్కువగా బోట్లు వాడతారు. విమానాలు, స్నోమొబైల్ల మీద అరుదుగా ప్రయాణిస్తారు. దగ్గర దగ్గర దూరాలకైతే కుక్కలతో నడిచే డాగ్స్లెడ్ల మీదెక్కి వెళతారు. |
అర్ధరాత్రి సూరీడు!
* భూమిపై ఇదున్నచోటు, తీరుని బట్టి ఇక్కడో విచిత్రం కనిపిస్తుంది. మే మధ్య నుంచి జులై మధ్య వరకూ ఇక్కడ సూర్యుడు ఎప్పుడూ పూర్తిగా అస్తమించడు. అంటే అర్ధరాత్రి కూడా కనిపిస్తాడన్నమాట. |
జనం కొంచెం.. భూమి ఘనం!
* విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఇది పెద్ద దేశమే. దాదాపుగా గ్రేట్బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలను కలిపితే ఎంతో అంతకన్నా ఎక్కువే. అయితే జనాభా ఉన్నది మాత్రం వేలల్లోనే.
|
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..