నమోదు చేస్తారా? రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలా?

మహారాష్ట్రలో వినియోగదారులకు భరోసా కల్పిస్తున్న ‘మహా రెరా’.. 563 డెవలపర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది.

Published : 22 Jul 2023 01:17 IST

మహా రెరా బిల్డర్లకు హెచ్చరిక నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలో వినియోగదారులకు భరోసా కల్పిస్తున్న ‘మహా రెరా’.. 563 డెవలపర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. రెరా నిబంధనల ప్రకారం నిర్మాణ సంస్థలు ప్రతి మూడు నెలలకు ప్రాజెక్ట్‌ పురోగతిని రెరా వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. నిర్మాణం ఏ దశలో ఉందో తెలిపే సమాచారం మాత్రమే కాదు.. ఆర్థిక వివరాలనూ అందజేయాలి. ఈ నిబంధనను చాలామంది బిల్డర్లు పాటించడం లేదు. దీంతో మే నెలలో 746 డెవలపర్లకు మహా రెరా నోటీసులు జారీ చేసింది. వీరిలో 183 సంస్థలు త్రైమాసిక పురోగతి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాయి. మిగతా సంస్థలు స్పందించక పోవడంతో వారిని హెచ్చరించింది. పురోగతి సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపర్చకపోతే ప్రాజెక్ట్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని నోటీసులు పంపింది. 45 రోజుల గడువు ఇచ్చింది. రెరా చట్టం సెక్షన్‌ 11 ప్రకారం ప్రాజెక్ట్‌ త్రైమాసిక పురోగతిని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. విఫలమైతే జరిమానా విధించొచ్చు.. రిజిస్ట్రేషన్‌ రద్దు చేయవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని