రూ.57వేల కోట్ల గృహ రుణాలు జారీ

హైదరాబాద్‌ సర్కిల్‌ గృహరుణాల పోర్ట్‌ఫోలియో రూ.57వేల కోట్లను అధిగమించిందని ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం రాజేష్‌కుమార్‌ తెలిపారు. గత మూడేళ్లలోనే రూ.23వేల కోట్లు పెరిగిందని తెలిపారు.

Published : 02 Dec 2023 00:36 IST

గత మూడేళ్లలోనే రూ.23వేల కోట్లు మంజూరు
మెగా ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సర్కిల్‌ గృహరుణాల పోర్ట్‌ఫోలియో రూ.57వేల కోట్లను అధిగమించిందని ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం రాజేష్‌కుమార్‌ తెలిపారు. గత మూడేళ్లలోనే రూ.23వేల కోట్లు పెరిగిందని తెలిపారు. రుణ మంజూరు సమయాన్ని తగ్గించేందుకు డిజిటలైజ్‌ చేసినట్లు చెప్పారు. 1150 శాఖలు, మార్కెటింగ్‌ బృందాలు, 25 ప్రత్యేక ప్రాసెసింగ్‌ కేంద్రాల ద్వారా గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఎస్‌బీఐ మెగా ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో గృహ నిర్మాణం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. మార్కెట్‌ సర్వే ప్రకారం ఐటీ, కమర్షియల్‌ స్పేస్‌ వృద్ధి చెందడం ద్వారా అల్ట్రా, మిడ్‌, సరసమైన విభాగంలో ఇళ్ల కొనుగోలులో వృద్ధి కనిపించిందని అన్నారు.

వడ్డీరేట్లలో ప్రత్యేక తగ్గింపు : పండగల సందర్భంగా గృహరుణాలపై వడ్డీరేటులో 0.25 శాతం రాయితీ ఇస్తున్నామని.. ప్రాపర్టీ షోను సందర్శించి వినియోగించుకోవాలని రాజేశ్‌కుమార్‌ కోరారు. ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు.

రోజుకు 500 కోట్ల రుణాల జారీ : హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధిలో భాగం కావడానికి కట్టుబడి ఉన్నామని ముంబయిలోని ఎస్‌బీఐ - ది రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ హౌసింగ్‌ బిజినెస్‌ విభాగం సీజీఎం ఉషాగౌతమ్‌ అన్నారు. మార్కెట్‌ లీడర్‌గా ఉన్న ఎస్‌బీఐ హౌసింగ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ.7 ట్రిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రతిరోజూ రూ.500 కోట్లు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తనఖా పోర్ట్‌ఫోలియో రూ.31 లక్షల కోట్లుగా ఉందని వెల్లడించింది.

ధరలు తగ్గుతాయని వేచి ఉండొద్దు : హైదరాబాద్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోందని.. ప్రాప్‌టైగర్‌ నివేదిక ప్రకారం గత త్రైమాసికంలో 14వేల యూనిట్లు అమ్ముడయ్యాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు వి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇళ్ల ధరలు తగ్గుతాయని ఊహించి వేచి ఉండవద్దని..  ఎస్‌బీఐ అందిస్తున్న వడ్డీ తగ్గింపును వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు.

ఆటో పైలెట్‌ మోడ్‌ : హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆటోపైలట్‌ మోడ్‌లో పనిచేస్తుందని.. అది మరింత వృద్ధి చెందుతుందని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు బి.సునీల్‌చంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ 200 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా మారుతుందని.. రాబోయే రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరంగా అవతరిస్తుందని అన్నారు.


సరసమైన ఇళ్లకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలి

రసమైన ఇళ్లు రూ.60-75 లక్షల ధరల శ్రేణిలో ఉన్నవాటికి ఎస్‌బీఐ ప్రత్యేకంగా పరిగణించి అదనపు రాయితీలు ఇవ్వాలని ఎస్‌బీఐ యాజమాన్యానికి తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌ కోరారు. గృహ రుణ గ్రహీతలకు వడ్డీ రాయితీలను పునరుద్ధరించాలని అభ్యర్థించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు