ఇళ్ల ధరల్లో 19 శాతం పెరుగుదల

ఇళ్ల ధరల్లో పెరుగుదల దేశంలోనే అత్యధికంగాహైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ ఏడాది కాలంలో ధరల్లో 19 శాతం వృద్ధి కనిపించిందని క్రెడాయ్‌-కొలియర్స్‌ తాజాగా వెల్లడించిన హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ నివేదికలో పేర్కొంది. దేశంలోని ఎనిమిది పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10 శాతంగా ఉంది. మన తర్వాత ఎక్కువ పెరుగుదల బెంగళూరులో 18 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 2023 మూడో త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు 5 శాతం పెరిగాయి. వార్షిక పెరుగుదల 19 శాతం ఉంది.

Updated : 02 Dec 2023 07:47 IST

క్రెడాయ్‌- కొలియర్స్‌ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

ఇళ్ల ధరల్లో పెరుగుదల దేశంలోనే అత్యధికంగాహైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ ఏడాది కాలంలో ధరల్లో 19 శాతం వృద్ధి కనిపించిందని క్రెడాయ్‌-కొలియర్స్‌ తాజాగా వెల్లడించిన హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ నివేదికలో పేర్కొంది. దేశంలోని ఎనిమిది పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10 శాతంగా ఉంది. మన తర్వాత ఎక్కువ పెరుగుదల బెంగళూరులో 18 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 2023 మూడో త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు 5 శాతం పెరిగాయి. వార్షిక పెరుగుదల 19 శాతం ఉంది. ఇక్కడ సగటు కార్పెట్‌ ఏరియా ధర రూ.11,040 ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక ఇళ్ల ధరలు ముంబయిలో ఉన్నాయి. ఇక్కడ చ.అ. ధర రూ.19,585గా ఉంది. ఏడాదిలో ఇక్కడ ఇళ్ల ధరల పెరుగుదల కేవలం ఒక శాతం మాత్రమే.

సెంట్రల్‌ హైదరాబాద్‌లో...

ప్రీమియం ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లో ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కొత్తగా సెంట్రల్‌ హైదరాబాద్‌లో సబ్‌ మార్కెట్‌ ఏర్పడిందని నివేదికలో వెల్లడించారు. ఇక్కడ పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తవి కూడా వస్తున్నాయి. ప్రీమియం ప్రాజెక్టుల కారణంగా సగటు ధరల్లో పెరుగుదల కారణమని చెబుతున్నారు.


అమ్ముడుపోనివి తక్కువే

దేశవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో అమ్ముడుపోని ఇళ్లను పరిశీలిస్తే హైదరాబాద్‌లో 9 శాతంగా ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 38 శాతం, పుణెలో 12, దిల్లీలో 11, అహ్మదాబాద్‌లో 9, చెన్నై, బెంగళూరులలో 8, కోల్‌కతాలో అత్యల్పంగా 5 శాతం ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని