రియల్‌ ఎస్టేట్‌లోనే సంపన్నుల పెట్టుబడులు

అత్యంత సంపన్నులు వారి సంపదను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? మరీ ముఖ్యంగా నికర సంపద విలువ రూ.250 కోట్ల వరకు ఉన్న అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివ్యూజువల్స్‌(యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) ఆదాయ రహస్యమేంటి? అన్నింటికీ ఒకటే సమాధానం రియల్‌ ఎస్టేట్‌.

Published : 16 Mar 2024 04:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత సంపన్నులు వారి సంపదను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? మరీ ముఖ్యంగా నికర సంపద విలువ రూ.250 కోట్ల వరకు ఉన్న అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివ్యూజువల్స్‌(యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) ఆదాయ రహస్యమేంటి? అన్నింటికీ ఒకటే సమాధానం రియల్‌ ఎస్టేట్‌. 2024 వెల్త్‌ రిపోర్ట్‌ ప్రకారం.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో 32 శాతం మంది రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. సొంతానికి ఇల్లు కొన్నా అది వారి పాలిట బంగారమే అవుతోంది. అత్యంత సంపన్నుల్లో 12 శాతం మంది 2024లో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇల్లు కొంటామని చెబుతున్న వారి శాతం 22 శాతంగా ఉంది. సంపన్న భారతీయుల్లో సగటున 2.57 ఇళ్లు ఉన్నాయి.  ఒకటి ఉండటానికి ఉపయోగించుకుంటూ మరో ఇంటిని అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లోనూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

  • రియల్‌ ఎస్టేట్‌ కాకుండా విలాస, అరుదైన వస్తువులపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఖరీదైన గడియారాలు, ఆర్ట్‌, ఆభరణాలపై అధికంగా వెచ్చిస్తున్నారు.
  • విదేశాల్లో అయితే వీటితో పాటు రంగుల వజ్రాలు, వైన్‌, ఫర్నిచర్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, కార్లపైనే మక్కువ చూపుతున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని