అక్కడ స్థిరాస్తి కొనడం చాలా ఖరీదు

మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.8.28 కోట్లు... మోనాకో నగరంలో 16 చ.మీటర్ల స్పేస్‌ మాత్రమే కొనగలం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఇదొకటి. హాంకాంగ్‌లో 22 చ.మీ., సింగపూర్‌లో 32 చ.మీ. కొనగలం. భారత్‌లోని నగరాల్లో ముంబయి అత్యంత ఖరీదైన ప్రాంతమని తెలిసిందే.

Published : 16 Mar 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌ : మిలియన్‌ యూఎస్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.8.28 కోట్లు... మోనాకో నగరంలో 16 చ.మీటర్ల స్పేస్‌ మాత్రమే కొనగలం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఇదొకటి. హాంకాంగ్‌లో 22 చ.మీ., సింగపూర్‌లో 32 చ.మీ. కొనగలం. భారత్‌లోని నగరాల్లో ముంబయి అత్యంత ఖరీదైన ప్రాంతమని తెలిసిందే. ఇక్కడ ఆ సొమ్ముతో 103 చ.మీటర్ల వరకు డిమాండ్‌ ఉన్న ప్రాంతంలోనే కొనగలం. ఆర్థిక రాజధాని ముంబయితో పోలిస్తే దేశ రాజధాని దిల్లీలో రెండింతల విస్తీర్ణం సొంతం చేసుకోగలం. ఇక్కడ 217 చ.మీ. వరకు వస్తుంది. బెంగళూరులో 377 చ.మీ.విస్తీర్ణం కల్గిన స్థిరాస్తిని ప్రధాన ప్రాంతంలో సొంతం చేసుకోగలం.

కొవిడ్‌ తర్వాత మరింతగా..

2019 నుంచి 2023 వరకు ముంబయి, దిల్లీ, బెంగళూరులో మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు సమకూరే స్థిరాస్తి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో కొనేవారు తగ్గిపోవడంతో ధరలు కొంత దిగి వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ పెరిగాయి.

  • ముంబయిలో మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు 2019లో 102 చ.మీ. విస్తీర్ణం కల్గిన స్థిరాస్తి కొంటే.. 2020, 2021, 2022లో కొవిడ్‌తో ధరలు తగ్గడంతో కొనే విస్తీర్ణం 106, 108.1, 113    చ.మీ.లకు పెరిగింది. 2023లో ధరల పెరుగుదలతో 103 చ.మీ. కొనగల్గే విస్తీర్ణం తగ్గింది.
  • దిల్లీ, బెంగళూరులోనూ ఇదే పోకడ కొనసాగింది. దిల్లీలో 2022లో 226 చ.మీ. స్పేస్‌ని మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు కొంటే.. 2023కి వచ్చేసరికి 217 చ.మీ.కి తగ్గింది. బెంగళూరులో 385 చ.మీ. నుంచి 377 చ.మీ.వరకు తగ్గిందని నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని