గృహ రుణాలు పెరుగుతున్నాయ్‌

హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ సంస్థల నుంచి బిల్డర్ల రుణాల వాటా తగ్గితే.. గృహ కొనుగోలుదారులు తీసుకునే రుణాల వాటా పెరుగుతోంది.

Published : 23 Mar 2024 00:47 IST

ఈనాడు, హైదరాబాద్‌

హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ సంస్థల నుంచి బిల్డర్ల రుణాల వాటా తగ్గితే.. గృహ కొనుగోలుదారులు తీసుకునే రుణాల వాటా పెరుగుతోంది. కేర్‌ ఎడ్జ్‌ రేటింగ్‌ సంస్థ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో రిటైల్‌ రుణాల తీరును 2019 నుంచి 2023 వరకు విశ్లేషించింది.

  • మార్చి 2019లో గృహ రుణాల వాటా 65.4 శాతం ఉంటే.. బిల్డర్ల రుణాల వాటా 13.8 శాతంగా ఉంది. 2020 మార్చిలో 66.8, 12.5 శాతంగా వాటాలు ఉన్నాయి. తర్వాత నుంచి ఏటా క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
  • కొవిడ్‌ తర్వాత మరింతగా బిల్డర్ల రుణాల వాటా తగ్గింది. మార్చి-21లో 11.6 శాతం, మార్చి-22లో 9.3 శాతం, మార్చి-23లో 7.1 శాతానికి పడిపోయాయి. అదే సమయంలో రిటైల్‌ గృహ రుణాల వాటా 68.1 శాతం నుంచి 75.4 శాతానికి పెరిగింది.
  • రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో నివాస విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఆశాజనకంగా ఉండటంతో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని కొనసాగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని