వేగంగా రిటైల్‌ విస్తరణ

రియల్‌ ఎస్టేట్‌లోని వాణిజ్య నిర్మాణాల్లో మారుతున్న లీజింగ్‌ పోకడలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుంటాయి. ఇటీవలి వరకు లగ్జరీ బ్రాండ్లకు చిరునామాగా మాల్స్‌ ఉండేవి.

Published : 30 Mar 2024 01:16 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌లోని వాణిజ్య నిర్మాణాల్లో మారుతున్న లీజింగ్‌ పోకడలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లు వస్తుంటాయి. ఇటీవలి వరకు లగ్జరీ బ్రాండ్లకు చిరునామాగా మాల్స్‌ ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా హైస్ట్రీట్స్‌కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

దేశంలో లగ్జరీ రిటైల్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆదాయాలు పెరగడం, వినియోగ సంస్కృతి విస్తరించడంతో నగరాల్లో ముఖ్యంగా నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌లలో విలాసవంతమైన బ్రాండ్ల స్టోర్ల ఏర్పాటు పెరిగింది.

  • దేశంలోని ఎనిమిది అగ్రశ్రేణి నగరాల్లో విలాసవంతమైన బ్రాండ్ల లీజింగ్‌ హైస్ట్రీట్లలో 0.3 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే వందశాతం పెరుగుదల ఇది.
  • మాల్స్‌లో లగ్జరీ స్టోర్స్‌ లీజింగ్‌ 0.24 మి.చ.అ.గా ఉంది.
  • విలాసవంతమైన బ్రాండ్ల దుకాణాలు స్టాండలోన్‌ నిర్మాణాల్లో కేవలం 0.1 మిలియన్‌ చదరపు అడుగులు మాత్రమే ఉంది.
  • హైదరాబాద్‌లో రిటైల్‌ స్టోర్లకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ హైస్ట్రీట్స్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని