మహా రెరాలో అత్యధిక రికవరీ వారెంట్లు

రెరా చట్టం అమలులో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహా రెరా నిబంధనలను ఉల్లంఘలిస్తున్న నిర్మాణ సంస్థలపై కొరఢా ఝులిపిస్తోంది. 117 ప్రాజెక్టుల నుంచి ఏకంగా రూ.160 కోట్లను 237 రికవరీ వారెంట్ల ద్వారా స్వాధీనం చేసుకుంది.

Updated : 20 Apr 2024 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెరా చట్టం అమలులో దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహా రెరా నిబంధనలను ఉల్లంఘలిస్తున్న నిర్మాణ సంస్థలపై కొరఢా ఝులిపిస్తోంది. 117 ప్రాజెక్టుల నుంచి ఏకంగా రూ.160 కోట్లను 237 రికవరీ వారెంట్ల ద్వారా స్వాధీనం చేసుకుంది. 2023-24లో దేశంలోనే ఇది  అత్యధికం. ఈ ప్రక్రియను  వేగవంతం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన సంగతి  తెలిసిందే. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టం ప్రకారం ముంబయి శివారు ప్రాంతాల్లోని ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణ సంస్థలపై రికవరీ వారెంట్లు జారీ అయ్యాయి. ఆ తర్వాత పుణెలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 421 ప్రాజెక్టుల నుంచి 661.15 కోట్లకు 1095 వారెంట్లను జిల్లా అధికారులు జారీ చేశారు.

తెలంగాణలో ఇలా

నిర్మాణాలు, లే అవుట్లపై ఇప్పటి వరకు 1,698 ఫిర్యాదులు రాగా.. ఇప్పటి వరకు 1,098 ఫిర్యాదుల్లో తెలంగాణ రెరా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంస్థలపై రూ.22 కోట్ల వరకు అపరాధ రుసుము విధించింది. చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మన దగ్గర రెరా అథారిటీ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఇటీవలే పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలెట్టింది కాబట్టి  రికవరీ వారెంట్ల దాకా వెళ్లలేదని రెరా అధికారులు పేర్కొంటున్నారు.  నాలుగైదు కేసుల్లో మాత్రమే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు పంపినట్లు వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని