Hyderabad: అడ్డంకులు అధిగమించి అత్యధిక వృద్ధి
రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు తొలి త్రైమాసికం కలిసి వచ్చింది. ఆర్థిక మందగమనం, అధిక వడ్డీరేట్లు, ఉద్యోగాల కోతల నడుమ సైతం రియాల్టీ స్థిరమైన వృద్ధిని కనబర్చింది.
వార్షికంగా ఇళ్ల విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల సరఫరాలో పెరుగుదల
ఈనాడు, హైదరాబాద్
రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు తొలి త్రైమాసికం కలిసి వచ్చింది. ఆర్థిక మందగమనం, అధిక వడ్డీరేట్లు, ఉద్యోగాల కోతల నడుమ సైతం రియాల్టీ స్థిరమైన వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో హైదరాబాద్ ఇళ్ల విక్రయాలు 55 శాతం పెరిగాయని ప్రాప్‌టైగర్ సంస్థ వెల్లడించింది. దేశంలోని అన్ని నగరాలతో పోలిస్తే అత్యధిక వృద్ధి ఇక్కడే నమోదైందని తెలిపింది. ముంబయి, పుణె, అహ్మదాబాద్, చెన్నైలో విక్రయాలు పెరిగాయని.. కొత్త ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున ప్రారంభించారని తెలిపింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణ మార్కెట్ పనితీరు జనవరి-మార్చి కాలంలో బాగుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇళ్ల విక్రయాల్లో 22 శాతం వృద్ధి కనిపించగా.. కొత్త ప్రాజెక్టుల్లో సరఫరా 86 శాతం పెరిగిందని వెల్లడించింది.
* ఎనిమిది నగరాల్లో తొలి త్రైమాసికంలో 85వేల యూనిట్లు విక్రయించారని.. గతేడాది 70,630 యూనిట్లతో పోలిస్తే చాలా పెరిగాయని నివేదికలో పేర్కొంది.
రికార్డు స్థాయిలో...
కొత్త ఇళ్ల సరఫరా భారీగా పెరిగింది. పలు సంస్థలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడంతో సరఫరా పెరిగింది. గత ఏడాది 79,530 యూనిట్ల సరఫరా ఉండగా.. ఈసారి ఏకంగా 1,47,780 యూనిట్లకు పెరిగింది. ఇది 86 శాతం అధికం.
త్రైమాసికంతో పోలిస్తే వెనుకబాటు
ఇళ్ల విక్రయాల్లో 2022 చివరి త్రైమాసికంతో పోల్చినప్పుడు మాత్రం 2023 తొలి త్రైమాసికంలో వృద్ధి నెమ్మదించింది. మైనస్ 1 శాతం నమోదైంది.
* అక్టోబరు నుంచి డిసెంబరు 22 వరకు 10,340 ఇళ్లు విక్రయిస్తే.. జనవరి నుంచి మార్చి వరకు 10,200 ఇళ్లు మాత్రమే అమ్మగలిగారు.
* దిల్లీలో సైతం ప్రతికూల వృద్ధి కనిపించింది. మిగతా నగరాలైన బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబయి, పుణెలలో త్రైమాసికం పరంగా సానుకూల వృద్ధి నమోదైంది.
కొత్త ప్రాజెక్టుల్లో ఇలా
* హైదరాబాద్‌లో 2022 తొలి త్రైమాసికంలో 14,580 ఇళ్లకు సంబంధించి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 17,930కి పెరిగింది. వార్షిక వృద్ధి 23 శాతంగా ఉంది.
* దిల్లీ తర్వాత అత్యల్ప వృద్ధి మన దగ్గరే కనిపించింది. మిగతా నగరాల్లో కొత్త సరఫరా పరంగా అనూహ్య వృద్ధి ఉంది. జాతీయ సగటు 86 శాతం ఉండగా ఆయా నగరాల్లో అంతకంటే ఎక్కువే నమోదయ్యాయి.
* గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కొత్త ప్రాజెక్టులు భారీగా ప్రారంభం అయ్యాయి. వీటిలో 24,310 ఇళ్లు ఉన్నాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టులు 26 శాతం తగ్గాయి. యూనిట్ల సంఖ్య 17,930కి పడిపోయింది.
హైదరాబాద్‌లో
గత ఏడాది తొలి త్రైమాసికంలో 6560 ఇళ్లు మాత్రమే విక్రయించగా ఈ సారి వీటి సంఖ్య 10,200కి చేరింది. వార్షిక వృద్ధి 55 శాతంగా ఉంది.
* వార్షిక వృద్ధి పరంగా మన తర్వాత ముంబయి(39%), అహ్మదాబాద్(31%), పుణె(16%), చెన్నై(10%) నగరాలు ఉన్నాయి. బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CSK vs GT: సీఎస్కేకు ఐదో టైటిల్.. ఈ సీజన్లో రికార్డులు ఇవే!
-
Crime News
Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి