నమస్కారం ఎందుకు చేయాలి?

భారతీయ సంప్రదాయంలో పెద్దవాళ్లను, కొత్తవారిని పరిచయం చేసినప్పుడు నమస్కారం చేస్తుంటారు. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా

Published : 01 May 2016 21:27 IST

నమస్కారం ఎందుకు చేయాలి?

భారతీయ సంప్రదాయంలో పెద్దవాళ్లను, కొత్తవారిని పరిచయం చేసినప్పుడు నమస్కారం చేస్తుంటారు. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా చేర్చి చేసేదే నమస్కారం. పెద్దా, చిన్నా ఎవరికయినా మనం నమస్కారంతో గౌరవిస్తుంటాం. నమస్కారం ద్వారా మనలోని అహాన్ని నిర్మూలించడంతో పాటు ప్రేమ, మానవత్వం, స్నేహం... తదితర గుణాలను వ్యక్తం చేస్తుంటాం. దేవాలయాల్లో దైవారాధనలో కళ్లు మూసుకొని నమస్కారం చేస్తాం. దీని ద్వారా అంతర్లీనంగా భగవంతుని సన్నిధిలో వున్నట్టు అనుభూతికి లోనవుతాం. మేధావులు, మహాపురుషులు, పెద్దవారు, విజ్ఞానుల దగ్గరకు వెళ్లినప్పుడు వారి వద్ద పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం. వారిలోని గొప్పదనానికి వందనం చేసినట్టు అని అర్థం. మానవుల్లో రకరకాల తేడాలున్నప్పటికీ అందరిలోనూ ఆ పరమాత్మ ఒక్కడే. ఎదుటివారు కూడా తన లాంటి వారేనన్న భావనతో చేసేదే నమస్కారమని పెద్దలు చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని