దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి?

దేవాలయం పవిత్రప్రదేశం. ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి. భగవంతుని దర్శనం పూర్తికాగానే

Published : 03 May 2016 22:18 IST

దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి?

దేవాలయం పవిత్రప్రదేశం. ఆలయంలో నిత్యం శ్లోకాలు, ఘంటానాదాలు, భక్తుల ప్రార్థనలు, పురోహితుల వేదమంత్రాలు వినవస్తుంటాయి. భగవంతుని దర్శనం పూర్తికాగానే ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది సంప్రదాయం. మనం అనేక సమస్యలతో సతమతమవుతుంటాం. మానసిక ప్రశాంతత కోసం పరంధామున్ని దర్శనం చేసుకున్న అనంతరం కాసేపు కూర్చొని భగవంతుని ఆరాధన గానీ ప్రసాదం స్వీకరణ గానీ చేయాలి. ఆ సమయంలో మన మనస్సులో ఆ దివ్యమంగళ స్వరూపమే దర్శనమిస్తుంటుంది. స్వామివారిని చూసిన అలౌకిక ఆనందం మిగులుతుంది. మనసు ఇతర ప్రాపంచిక అంశాలపైకి వెళ్లకుండా దైవంపైనే కేంద్రీకరిస్తుంది. అందుకనే క్యూలో నిలబడి భగవంతుని దర్శనం చేసుకున్న అనంతరం కాసేపు గుడిలో కూర్చోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని