వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు?

నిమ్మకాయలు, తియ్యగుమ్మడి వంటివాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికిగాను సాత్త్విక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా...

Published : 03 May 2017 00:02 IST

వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు?

నిమ్మకాయలు, తియ్యగుమ్మడి వంటివాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి గాను సాత్విక‌  దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తారు. దైవానికి నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడతారు. దిష్టితీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని ఆశిస్తారు. పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిష శాస్త్ర కారణం ఉంది. గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని