Amazon: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ తేదీలు వచ్చేశాయ్‌.. ఈ ఫోన్లపై డిస్కౌంట్‌

Amazon: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుందని ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ వెల్లడించింది.

Published : 28 Apr 2024 00:00 IST

Amazon Great Summer sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరో బిగ్‌ సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ (Great Summer Sale) తేదీని తాజాగా ప్రకటించింది.  మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. మరో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను వెల్లడించింది. మే 3 నుంచి మే 9 వరకు సేల్‌ నిర్వహించనుంది. అయితే, అమెజాన్‌ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రైమ్‌ మెంబర్లకు మే 1 అర్థరాత్రి 12 తర్వాత నుంచే సేల్‌ మొదలుకానుంది. ఈ సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌ను ప్రైమ్‌ చందాదారులు అందరికంటే ముందుగానే పొందొచ్చు.

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటినుంచంటే?

గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు దారులకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉందని కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది. సేల్‌ సమయంలో చేసే ఫస్ట్‌ ఆర్డర్‌పై ఫ్రీ డెలివరీ అందించడంతో పాటు వెల్‌కమ్‌ రివార్డ్‌ పేరిట 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. దుస్తులు, స్మార్ట్‌వాచ్‌లు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు ఉండనున్నాయి. అమెజాన్‌ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ, కిండ్లే డివైజుల మీద ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్‌ సమయంలో యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రెడ్‌మీ, నార్జో, ఐకూ, పోకో, హానర్‌, టెక్నో వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వేటిపై ఎంతెంత డిస్కౌంట్‌ అనేది కంపెనీ రివీల్ చేయలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడి కానున్నాయి. వీటితో పాటు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని