Dosa Eating Challenge: ఈ దోశ తింటే రూ. 71,000 ప్రైజ్‌మనీ

వేడి వేడిగా, రుచిగా ఏదైనా అల్పాహారం తినాలనుకున్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేది మసాలా దోశనే. చల్లటి వాతావరణంలో ఉఫ్ ఉఫ్‌మని ఊదుకుంటూ దోశలు తింటుంటే వచ్చే మాజానే వేరు. రుచికరంగా ఉండే

Published : 04 Feb 2022 02:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వేడి వేడిగా, రుచిగా ఏదైనా అల్పాహారం తినాలనుకున్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేది మసాలా దోశనే. చల్లటి వాతావరణంలో ఉఫ్ ఉఫ్‌మని ఊదుకుంటూ దోశలు తింటుంటే వచ్చే మజానే వేరు. రుచికరంగా ఉండే ఈ అల్పాహారాన్ని తయారు చేయడం కూడా సులువే. ఆర్డర్‌ చేసిన ఐదు నిమిషాల్లో మన ముందు ఉంచుతారు.  కొంతమంది ఆహారప్రియులు మూడు, నాలుగు దోశలు సైతం ఒకేసారి లాగించేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే దిల్లీలోని ఓ రెస్టారంట్‌ ‘దోశ ఈటింగ్‌ ఛాలెంజ్‌’ని నిర్వహిస్తోంది. దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉన్న శక్తి సాగర్​ రెస్టారంట్‌లో 10 అడుగుల దోశను ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. దీని ధర రూ.1500. 

10 అడుగులుండే ఈ పొడవాటి దోశ‌ను ఒక్క‌రే 40 నిమిషాల్లో తింటే రూ. 71,000 ప్రైజ్‌మనీ అందిస్తామని ఆ రెస్టారంట్‌ నిర్వాహకులు ప్రకటించారు. వారంతాల్లో కుటుంబ సభ్యులతో వచ్చే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ దోశను తయారు చేస్తారు. ఇది అందరికీ బాగా నచ్చుతుందని రెస్టారంట్​ యాజమాని చెబుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు దోశ పొడవును ఈ ఛాలెంజ్‌ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీతో హోటల్‌కు వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. మీరొక్కరే ఈ దోశని తినగల్గుతామనుకుంటే ఓ సారి వెళ్లి ట్రై చేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని