ఉద్యోగం ఇవ్వాలా? వద్దా?

మొహం చూసి గుణం చెప్పేయొచ్చు అంటారు పెద్దలు. అలాగే ఓ అభ్యర్థి వీడియో చూసి తను మా సంస్థలో ఉద్యోగం చేయడానికి సరిపోతాడో, లేదో నిర్ణయిస్తున్నాయి కొన్ని కంపెనీలు.

Published : 16 Sep 2017 01:47 IST

‘యాప్‌’రే!
ఉద్యోగం ఇవ్వాలా? వద్దా?

మొహం చూసి గుణం చెప్పేయొచ్చు అంటారు పెద్దలు. అలాగే ఓ అభ్యర్థి వీడియో చూసి తను మా సంస్థలో ఉద్యోగం చేయడానికి సరిపోతాడో, లేదో నిర్ణయిస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీనికోసం HireVue అనే యాప్‌ సాయం తీసుకుంటున్నాయి. ఈరోజుల్లో చాలా సంస్థలు ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీడియో ఇంటర్వ్యూలు చేయడం మామూలే. ఈ సమయంలోనే ఆ వీడియో ఇంటర్వ్యూని ఈ యాప్‌తో అనుసంధానం చేస్తారు. అభ్యర్థి శరీరభాష, భావోద్వేగాలు, ముఖ కవలికలు, స్వరంలోని హెచ్చుతగ్గులు, పాత ఉద్యోగులతో పోల్చి చూడటం.. ఇలా 25 వేల రకాల భావాలను పసిగట్టి అభ్యర్థి ప్రతిభను అంచనా వేస్తుంది యాప్‌. సంస్థ అవసరాలకే కాదు.. ఉద్యోగార్థులు సైతం ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని నమూనా వీడియో ఇంటర్వ్యూలు చేసుకుంటూ తమలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు