Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 May 2024 21:01 IST

1. ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిపై ఎన్నికల సంఘం బదిలీవేటు వేసింది. వారిద్దరినీ బదిలీ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్‌

భారత్‌ నేడు ప్రపంచదేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడమే కాకుండా, శక్తిమంతమైన దేశంగాను ఎదిగిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. దిల్లీ యూనివర్శిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో జరిగిన   ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘వికసిత భారత్ - ది వాయిస్ ఆఫ్ ది యూత్’’ అనే అంశంపై విద్యార్థులతో ముచ్చటించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్‌ నమోదు

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో దశ పోలింగ్‌ ముగిసింది. 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్‌లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 60.19 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. 25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు (Calcutta High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. కానీ, అభ్యర్థులు లేదా అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ ప్రభుత్వంలో ఆ హక్కులన్నీ పారిశ్రామికవేత్తలకే : రాహుల్‌గాంధీ

మోదీ అధికారంలోకి వస్తే జల్‌, జంగిల్‌, జమీన్‌( నీరు, అడవులు, భూములను) కొందరు పారిశ్రామికవేత్తలకే అప్పగిస్తారని రాహుల్‌ ఆరోపించారు. రాహుల్‌ మంగళవారం జార్ఖండ్‌లోని చైబా ప్రాంతంలో నిర్వహించిన పార్టీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన భాజపాపై విమర్శలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్‌ షాక్‌..!

భారత మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పేరున్న దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala)ను సంపన్నుడిగా మార్చిన షేర్లలో టైటాన్‌ కూడా ఒకటని పరిశీలకులు చెబుతారు. అదే షేరు సోమవారం ఆ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ సోమవారం మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పశువుల మేత మేసిన నేత.. రిజర్వేషన్లపై మాటలా?: లాలూపై మోదీ ఫైర్‌

ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు కల్పించాలంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ (Lalu Prasad Yadav) యాదవ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ లాలూపై తీవ్రంగా మండిపడ్డారు. పశువుల మేత మేసేసిన నేత.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  కేరళలో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ కలవరం.. లక్షణాలు ఇవే!

కేరళకు మరో వైరల్‌ ఫీవర్‌ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్‌, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఆస్ట్రేలియా హెలికాప్టర్‌పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య

చైనా(China)-ఆస్ట్రేలియా (Australia)ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి దీనికి యెల్లో సీ వేదికగా మారింది. ఆస్ట్రేలియా నౌకాదళానికి చెందిన ఓ హెలికాప్టర్‌పై డ్రాగన్‌కు చెందిన ఓ యుద్ధ విమానం నిప్పుల వర్షం కురిపించింది. గత వారాంతంలో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి 

10. భాజపాను డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలి: రేవంత్‌

రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓటమి తర్వాత అయినా కేసీఆర్‌లో మార్పువస్తుందని, రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడుగుతారని ఆశించామని అన్నారు. కానీ, ఆయనలో మార్పు రాలేదు సరికదా.. ఈ ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని