Sukumar: నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ

తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Published : 07 May 2024 21:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘నేను డైరెక్టర్‌ అనే దానికంటే సుకుమార్‌ శిష్యుడు అనే మాటే నాకు గౌరవం’ అని అన్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). ఇండస్ట్రీలోనే కాదు బయటా వీరిద్దరిది గురు-శిష్యుల బంధమే. అందుకే సోషల్‌మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారాయన. ఇండస్ట్రీలోకి రాకముందు సుకుమార్‌ (Sukumar) కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అదే కాలేజీ స్టూడెంట్‌ అయిన బుచ్చిబాబు.. సుకుమార్‌ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితులయ్యారు. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు దర్శకుడిగా మారితే తాను అదే బాటలో నడిచారు. కాలేజీ రోజుల్లో సుకుమార్‌ వద్ద లెక్కల పాఠాలతోపాటు కథలూ విన్న బుచ్చిబాబు ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా వర్క్‌ చేశారు. ఇప్పటికే పలుమార్లు తన మాస్టర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తంచేశారు. సుకుమార్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆర్య’ (Arya) 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేమ లేఖ రాశారు.

‘‘ఆర్యా.. ఇదే రోజు మీరు 20 ఏళ్ల క్రితం దర్శకుడిగా పుట్టినందుకు.. దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాకు పుట్టించినందుకు..’’ అంటూ ఆ సినిమాలోని ‘ఫీల్‌ మై లవ్‌’ సాంగ్ స్టైల్‌లో లెటర్‌ రాశారు. నెట్టింట ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం.. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని