నీళ్లు లేకుండా స్నానం

తలమీద నాలుగు చుక్కల నీళ్లు చల్లుకొని... ‘మమ’ అనుకుంటే స్నానం అయిపోయినట్లేనని...ఓ సినిమాలో చూపిస్తే... యువత దీనికి బాగా కనెక్టయ్యారు....

Published : 28 Apr 2018 01:37 IST

నీళ్లు లేకుండా స్నానం

లమీద నాలుగు చుక్కల నీళ్లు చల్లుకొని... ‘మమ’ అనుకుంటే స్నానం అయిపోయినట్లేనని...ఓ సినిమాలో చూపిస్తే... యువత దీనికి బాగా కనెక్టయ్యారు. ఆహా ఇలా స్నానం క్షణాల్లో అయిపోయే ఐడియా ఉంటే ఎంతబాగుణ్ను అనుకున్నారు. నీటి ఎద్దడి ఉన్న వారూ సైతం దీనికే ఓటేశారు.

వీరందరూ ఆశించన దానికంటే మిన్నగా... ఎంతో మందికి ఉపయోగకరంగా.... అసలే నీటి అవసరమే లేకుండా స్నానం పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. దిల్లీకి చెందిన డాక్టర్‌ పునీత్‌ గుప్తా, దిల్లీ ఐఐటీ సంయుక్తంగా ఈ ఉత్పత్తిని ఆవిష్కరించారు. ‘క్లినెసా’్ట అనే ఈ ప్రొడక్ట్‌తో చుక్కనీరూ అవసరం లేకుండా తలస్నానం సైతం చేయొచ్చు. మురికి, చెమట, దుర్గంధం లాంటి వాటిని స్నానంకంటే మెరుగ్గా శుభ్రం చేస్తుంది.

సైనికులు, రోగులు, నీటికొరత ఉన్న ప్రాంతాల వారికీ ‘క్లినెసా’్ట ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నాడు పునీత్‌. -45 డిగ్రీల్లో విధులు నిర్వహించే సైనికులకు నీరు అందుబాటులో ఉండదు. వీరికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మంచం పట్టిన రోగులకు మామూలుగా స్పాంజితో ఒళ్లు తుడుస్తాం. ఈ ప్రక్రియలో స్పాంజిని మళ్లీమళ్లీ అదే గిన్నెలో ముంచడం వల్ల మురికి, క్రిములు శరీరానికి తిరిగి అంటుకునే ప్రమాదం లేకపోలేదు. తాగడానికే నీరు లేక అవస్థలు పడుతున్న ఊర్లలో స్నానానికి ఇబ్బందులు తప్పవు. మరి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి పరిష్కారంగా తమ ఉత్పత్తి నిలుస్తుందంటున్నాడు పునీత్‌. శరీరానికి రాసుకొని, టవల్‌తో తుడుచుకుంటే స్నానం అయినట్లే. ఈ ఉత్పత్తి ధరా అందరికీ అందుబాటులో ఉంటుంది. క్లినెస్టా షాంపు రూ.499, సోప్‌ రూ.549. 100 మిల్లీలీటర్ల బాటిల్‌ 350 లీటర్ల నీటిని పొదుపు చేస్తుందంటున్నారు దీని ఆవిష్కర్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని