అమృత మెరుపులు
నటిగా మంచి మార్కులే కొట్టేసింది ‘అయేషా’, ‘కై పే చె’లాంటి హిట్ సినిమాల్లో నటించింది అమృతా పురి.
అమృత మెరుపులు
నటిగా మంచి మార్కులే కొట్టేసింది ‘అయేషా’, ‘కై పే చె’లాంటి హిట్ సినిమాల్లో నటించింది అమృతా పురి. ఇప్పుడు యాక్టింగ్ వదిలి డిజైనర్ అవతారమెత్తింది. అకూరీ పేరుతో సొంతంగా ఓ బ్రాండ్ తెరిచింది. మొదటి సినిమానే హిట్ కొట్టినట్టు మొదటి అడుగే ముంబయి ఫ్యాషన్ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్నాయి. వాటర్ కలర్ ప్రింట్లతో తను మార్కెట్లోకి వదిలిన క్రాప్‌టాప్, సూట్లు, షిఫ్ట్ డ్రెస్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాటన్, షిఫాన్, క్రీప్, హబిచ్యూట్ సిల్క్, లిక్రా లాంటి ఫ్యాబ్రిక్‌తో ఈ డిజైన్లు రూపొందించింది అమృత. ఏమాత్రం అనుభవం లేకుండానే ఆకట్టుకునేలా డిజైన్లు ఎలా రూపొందించావంటే తాను చేసి విదేశీ పర్యటనలే తనకు స్ఫూర్తి అంటోంది. గతంలో వియత్నాం వెళ్లినపుడు అక్కడి డిజైన్లు, ప్రకృతి దశ్యాలు, అక్కడి డిజైనర్లు వాడే రంగులు భలేగా నచ్చాయట. ఆ స్ఫూర్తితోనే డిజైనర్‌గా అవతారం ఎత్తింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?