బక్క‘చక్కని’ రూపం
ఫిట్‌మంత్రా
బక్క‘చక్కని’ రూపం
కండలు తిరిగితేనే ఫిట్‌గా ఉన్నట్లా?
సన్నగా ఉంటూ బలంగా తయారు కాలేమా?
చిన్న వ్యాయామాలతో శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోలేమా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తోంది... అథ్లెట్ ట్రైనింగ్. ఇప్పుడిదే యువత ట్రెండ్.
‘బాహుబలి’లో కండలు తీరిన దేహంతో ఆకట్టుకున్న రాణా ప్రస్తుతం సన్నబడి లీన్ బాడీకి వచ్చారు.
గజినీలో ముద్ద కండలతో కన్పించిన సూర్య ఇప్పుడు సన్నగా దృఢంగా కన్నిస్తున్నారు... వీరే కాదు!
బాలీవుడ్‌లో షారుక్ మొదట్లో సన్నగా ఉండేవారు... తర్వాత సన్నగా ఉంటూనే బలంగా మారిన దేహంతో ‘ఓం శాంతి ఓం’లో కన్పించి మెప్పించారు... ఇప్పటికీ ఆ దృఢత్వాన్ని మెయింటెన్ చేస్తున్నారు.
వీళ్లలా సన్నగా ఉంటూనే బలంగా కన్పించే ప్రయత్నం చేస్తోంది నేటి యువత. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అంతా ఇప్పుడు ఈ బక్క‘చక్కని’ మార్గంలో పయనిస్తున్నారు. కండలు తిరిగిన దేహం పాత స్టైల్ అయిపోయింది. నాజుగ్గా కన్పిస్తూ..బలంగా ఉండటానికి ‘అథ్లెట్ బాడీ’ ట్రెండ్‌ని ఫాలోఅవుతున్నారు. అథ్లెట్ బాడీ అంటే గుర్తొచ్చిందా? అదేనండీ... గట్టిగా, దృఢంగా ఉంటూనే సన్నగా కన్పిస్తారు. బాడీబిల్డింగ్ చేస్తే కొద్దోగొప్పో లావుగా కన్పిస్తారు. ఇలా కన్పించడం యువతరానికి ఇష్టం లేదు. అందుకే అందరూ అథ్లెట్‌బాడీ బాట పడుతున్నారు.
అథ్లెట్ ట్రైనింగ్ : దీన్నే మిలటరీ ట్రైనింగ్ అని, క్రాస్‌ఫిట్ అని అంటుంటారు. శరీరాన్ని శక్తిమంతంగా, దృఢంగా తయారు చేసుకోవడమే ఈ వర్క్‌అవుట్ ప్రత్యేకం. దీనికి చేయాల్సిన కసరత్తులు... మిలటరీ ప్రెస్, బెంచిప్రెస్, స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్, ఎరోబిక్ వ్యాయామాలు, స్కిప్పింగ్ ఇందులో భాగమే. బాడీబిల్డింగ్‌లోని బైసెప్, ట్రైసెప్, షోల్డర్స్, చెస్ట్, యాబ్స్ వంటి వర్క్‌అవుట్లు ఉండవు. రోజుమార్చి రోజు అవుట్‌డోర్ వర్క్‌అవుట్లు, కార్డియక్ వ్యాయామాలు ఇందులో భాగంగా ఉంటాయి. మంచి నిపుణుల పర్యవేక్షణలో క్రాస్‌ఫిట్ ట్రైనింగ్ తీసుకుంటే... త్వరగా సన్నబడొచ్చు. సన్నగా ఉన్న వాళ్లు బలంగా తయారుకావొచ్చు.
2017... విశ్వా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సమయానికి తినకపోవడం, వ్యాయామం అసలు లేకపోవడంతో బాగా లావైపోయాడు. పిజ్జాలు, బర్గ్‌ర్లు, ఆయిల్‌ఫుడ్స్ ఎక్కువగా తినేవాడు. 90కిలోలకు చేరుకున్నాడు. తన శరీరం తనకే బరువైపోయింది. 20మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడేవాడు. | 2018... ఇప్పుడు విశ్వా లీన్‌బాడీతో ఆఫీసులో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. కారణం అథ్లెట్ ట్రైనింగే. 6 నెలలుగా క్రమం తప్పకుండా జిమ్‌కు వెళుతున్నారు. సరైన ఆహారం, క్రమపద్ధతిలో వర్క్‌అవుట్లు... పూర్తిగా అతని స్వరూపాన్నే మార్చాయి. ఇప్పుడు నాలుగో అంతస్తుకైనా నడిచే వెళ్లగలుగుతున్నాడు. |
ఇంట్లోఅయితే ఇలా ఏ వ్యాయామానికైనా వార్మప్ ముఖ్యం. మొదట 10 నుంచి 15 నిమిషాలు వార్మప్ తప్పనిసరి. అన్ని జాయింట్లను తిప్పుతూ ముందు శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేసుకోవాలి.
వీటన్నింటినీ ప్రతి రోజూ ఇంట్లో చేసుకొని శరీరాన్ని దృఢంగా మార్చుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యాయామాన్ని 15-20 సార్లు చొప్పున 3 నుంచి 5 రౌండ్లు చేయాలి.
ఆహారం : ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ మోతాదులో పిండిపదార్థాలు తీసుకోవాలి. ఎగ్‌వైట్, దంపుడుబియ్యం, ఉడకబెట్టిన కూరగాయలు, మల్టీగ్రెయిన్ రోటీ, ఉడకబెట్టిన చేపలు, కాల్చిన మాంసం తీసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది. సరైన సమయంలో, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. క్రమబద్ధమైన నిద్ర ఈ వర్క్‌అవుట్లో ముఖ్యం.
ఫలితాలు
* వ్యాయామం రోజూ చేయడం వల్ల మన శరీరంలోని కండరాలు, ఎముకలు పూర్తిశక్తిని కలిగిఉంటాయి.
* బియ్యం మూట మోయటం, గ్యాస్ సిలిండర్ ఎత్తిపెట్టడం వంటి పనులకు శరీరం సహకరిస్తుంది.
* 5 కి.మీ. నడవాలన్నా, 5 అంతస్తులు ఎక్కిదిగాలన్నా.. భయం అవసరం లేదు.
* ఎక్కువ కి.మీ. ప్రయాణం చేసి, ఎక్కువ పనులు చక్కబెట్టుకోవాల్సి వచ్చినా మన శరీరం అలసిపోకుండా ఉంటుంది.
శరీరం తేలికగా...
ఇప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా క్రాస్‌ఫిట్‌పైనే దృష్టి పెడుతున్నారు. దీనివల్ల శరీరం తేలికగా, ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. మన రోజూ వారీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే వెసులుబాటు అందరినీ ఈ వర్క్‌అవుట్స్ వైపు నడిపిస్తోంది. రోజూ ఓ 40 నిమిషాల సేపు ఇంట్లోనైనా, మంచి ట్రైనర్ దగ్గరైనా ఈ కసరత్తులు చేస్తే రోజంతా చలాకీగా ఉండొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!