Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 Apr 2024 16:59 IST

1. మోదీ, రాహుల్‌ వ్యాఖ్యలు.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission:).. కోడ్‌ ఉల్లంఘన కింద భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మస్క్‌ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్‌ నేరగాడు టోకరా

 ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్టనిలువునా మునిగింది. మస్క్‌నంటూ నమ్మబలికిన కేటుగాడి మాయలో పడి రూ.లక్షల్లో నష్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?(Cyber crime) అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. అందుకు డీప్‌ఫేక్ వీడియో కారణమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్‌ ఛార్జీలు!

పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతా సర్వీస్‌ ఛార్జీలను సవరించాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, యెస్‌ బ్యాంక్‌ ఆ జాబితాలో ఉన్నాయి. మే 1 నుంచి కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. చెక్‌బుక్‌లు, ఐఎంపీఎస్‌ లావాదేవీలు, ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌ డెబిట్‌ రిటర్నుల వంటి ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్‌ సవరించింది. డెబిట్‌ కార్డు ఫీజు: ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99. చెక్‌ బుక్‌: తొలి 25 చెక్‌లు ఉచితం. తర్వాత ప్రతీ చెక్‌కు రూ.4 వసూలు చేయనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

 ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఎక్స్‌ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్‌ డెలివరీలు సేవలు..!

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ప్రాధాన్యం లేని రోజుల్లో డెలివరీలు చాలా త్వరగా అందేవి. రానురానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆర్డర్‌ చేతికందాలంటే కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో ప్రముఖ ఆహార సేవల సంస్థ జొమాటో (Zomato) ఫుడ్‌ ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఆ బ్లీచ్‌ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు

అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతోంది. అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా సంకోచించడంలేదు. తాజాగా ట్రంప్‌ జట్టును ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు

 దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ రాణించాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో స్దబ్దుగా ప్రారంభమైన మన మార్కెట్లు.. మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ‘మత ప్రాతిపదికన కాంగ్రెస్‌ రిజర్వేషన్లు కల్పిస్తోంది’ - మోదీ ఆరోపణలు

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకించారని.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం వక్రమార్గంలో వాటిని అమలుచేసి ఆయనకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనను దుర్భాషలాడుతూ రాహుల్‌ గాంధీ ఆనందిస్తున్నారని.. అయినప్పటికీ ఆయనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయకూడదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం సహా అన్ని సమస్యలకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునే చేర్చుకునే పార్టీ తమదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. భాజపా మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే: హరీశ్‌రావు

 భారాస హయాంలో మెదక్‌కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో నిర్వహించిన భారాస ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘ వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గతంలో బాండ్‌ పేపర్‌కు విలువ ఉండేది.. సీఎం రేవంత్‌ మోసంతో దాని విలువ పోయింది’’ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని