Apple: 25 శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే.. త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

Eenadu icon
By Business News Team Published : 04 Oct 2024 12:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Apple | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. త్వరలోనే మరో నాలుగు యాపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో ఐఫోన్‌16 సిరీస్‌ తయారీ గురించి ఈసందర్భంగా ప్రస్తావించింది.

భారత్‌లో తమ స్టోర్లను పెంచడంపై యాపిల్‌ రిటైల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీర్‌డ్రే ఓబ్రియన్‌ ఆనందం వ్యక్తంచేశారు. బెంగళూరు, పుణె, దిల్లీ-ఎన్సీఆర్‌, ముంబయిలో కొత్త స్టోర్లు తీసుకొస్తున్నట్లు ఈసందర్భంగా ఆయన వెల్లడించారు. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు యాపిల్‌ వెల్లడించింది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్‌ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎగుమతులు చేయనున్నట్లు పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో 25శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే చేయాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ కుబేరుల జాబితా.. బెజోస్‌ను దాటేసిన జుకర్‌ బర్గ్‌

ఐఫోన్‌16 సిరీస్‌.. మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో కొత్త స్టోర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. 2017లోనే యాపిల్‌ భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. 2023 ఏప్రిల్‌లోనే దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్‌ స్టోర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు