Fixed Deposits: బ్యాంకుల్లో లేటెస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే!

చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి.

Updated : 29 Mar 2024 13:58 IST

పెట్టుబడిదారులకు ఎన్ని మదుపు పథకాలు ఉన్నప్పటికీ కూడా, ఇప్పటికీ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారు పెరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్‌ బ్యాంకులు దాదాపు 1% అదనపు వడ్డీని ఇస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్‌లపై భద్రత ఉండడం వల్ల చాలా మంది బ్యాంకు ఎఫ్‌డీలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. రిస్క్‌ లేకుండా కచ్చితంగా వడ్డీ రావాలి అనుకునేవారు ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలవారు ఇప్పటికీ బ్యాంకు ఎఫ్‌డీలనే ఇష్టపడతారు. అయితే, బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్‌డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి. డిపాజిట్‌ వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారతాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల 1-3 సంవత్సరాల ఎఫ్‌డీ వడ్డీ రేట్లను కింది పట్టికలో చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని