BSNL SIM door delivery: సెల్ఫ్‌ కేవైసీతో BSNL సిమ్‌ కార్డుల డోర్‌ డెలివరీ

Eenadu icon
By Business News Team Published : 25 Jun 2025 13:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

BSNL SIM door delivery | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) తన సేవలను మెరుగుపరుచుకుంటోంది. ఇందులోభాగంగా తాజాగా సిమ్‌ కార్డుల డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటికే సిమ్‌కార్డులను చేరవేయనుంది. సెల్ఫ్‌ కేవైసీ ద్వారా మీ పేరుతో సిమ్‌ కార్డు పొందొచ్చు.

సిమ్‌ కార్డు డెలివరీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌లో ప్రత్యేక లింక్‌ అందుబాటులో ఉంచింది. ఈ లింక్‌ను క్లిక్‌ చేసి కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు ఇదే లింక్‌ ద్వారా సిమ్‌ కార్డును ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. తొలుత పిన్‌ కోడ్‌, పేరు, ప్రత్యామ్నాయ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. సిమ్‌ కార్డు మీ కోసమా? మీ కుటుంబసభ్యుల కోసమా? అని అడుగుతుంది. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ డేటాబేస్‌ నుంచి మీ వివరాలు ధ్రువీకరించుకుని, తర్వాత వీడియో రికార్డింగ్‌ ద్వారా మీ ఫొటోను క్యాప్చర్‌ చేయడంతో కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. 

సిమ్‌ కార్డు డోర్‌ డెలివరీకి సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే 1800 180 1503కి ఫోన్‌ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ సూచించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు ఉచితంగానే సిమ్‌ కార్డు డెలివరీని అందిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు ఈ సేవలను అందిపుచ్చుకుంది. ఇది ఉచితమా? లేదా కొంత మొత్తం ఛార్జీ చేస్తారా? అనేది తెలియరాలేదు. కొత్త సిమ్‌కార్డులతో పాటు, వేరే నెట్‌వర్క్‌ నుంచి పోర్ట్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు