క్రెడిట్‌ కార్డు.. వడ్డీ భారం లేకుండా..

క్రెడిట్‌ కార్డును వాడినప్పుడు పూర్తి బిల్లును గడువు తేదీ లోపు చెల్లించాలి. లేకపోతే బాకీ ఉన్న మొత్తంపై క్రెడిట్‌ కార్డు సంస్థలు వడ్డీని విధిస్తాయి.

Published : 19 Jan 2024 00:05 IST

క్రెడిట్‌ కార్డును వాడినప్పుడు పూర్తి బిల్లును గడువు తేదీ లోపు చెల్లించాలి. లేకపోతే బాకీ ఉన్న మొత్తంపై క్రెడిట్‌ కార్డు సంస్థలు వడ్డీని విధిస్తాయి. ఇది దాదాపు 35-40 శాతం వరకూ ఉంటుంది.

  • చాలామంది బిల్లులో కనీస మొత్తం చెల్లిస్తుంటారు. నిజానికి ఇది పెద్ద పొరపాటే. మిగిలిన బాకీపై కార్డు సంస్థలు వడ్డీని విధిస్తుంటాయి. నెలనెలా ఈ కనీస చెల్లింపు మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ రోజు నుంచే వడ్డీని లెక్కిస్తుంటాయి. కాబట్టి, వీలైనంత వరకూ అవసరమైనప్పుడే కార్డును వాడాలి. మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించేలా చూసుకోవాలి.
  • క్రెడిట్‌ కార్డుతో నగదును తీసుకునే వీలూ ఉంటుంది. కానీ, నగదు తీసుకున్న రోజు నుంచీ వడ్డీ చెల్లించాల్సిందే. కొనుగోళ్లతో పోలిస్తే.. దీనికి విధించే వడ్డీ అధికంగా ఉంటుంది.
  • సాధ్యమైనంత వరకూ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి నగదు తీసుకోకపోవడమే ఉత్తమం.
  • కార్డు బిల్లులను సకాలంలో చెల్లించినప్పుడు కొన్ని క్రెడిట్‌ కార్డులు రివార్డులను ఇస్తుంటాయి. వీటిని పొందేందుకు ప్రయత్నించాలి.
  • కార్డును తీసుకునేటప్పుడే.. బిల్లు ఆలస్యం అయినప్పుడు ఎంత శాతం వడ్డీ విధిస్తారన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. లేకపోతే అనవసర  భారం తప్పదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు