కారు రుణంపై టాపప్‌

మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్‌ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి.

Updated : 16 Feb 2024 00:53 IST

మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్‌ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి.

ఆర్థిక అత్యవసరాల్లో కొత్తగా రుణానికి దరఖాస్తు చేసి, వేచి చూడాల్సిన అవసరం లేకుండా కారు రుణంపై టాపప్‌ సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అవసరాలకూ వాడుకోవచ్చు. లేదా వాహనం మరమ్మతు కోసమూ వినియోగించుకోవచ్చు.

  •  కారు రుణం టాపప్‌ దరఖాస్తును బ్యాంకులు చాలా వేగంగా ఆమోదిస్తాయి.
  •  రుణ దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే ఖాతాలో డబ్బును జమ చేస్తాయి.
  •  సాధారణంగా ఎలాంటి అదనపు పత్రాలు అడకుండానే బ్యాంకులు టాపప్‌ రుణాన్ని అందించే అవకాశం ఉంది. కొన్నిసార్లు అదనంగా పత్రాలు కావాలని చెప్పొచ్చు.
  •  టాపప్‌ రుణాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పటికే రుణం తీసుకున్న బ్యాంకు వెబ్‌సైటు లేదా యాప్‌ నుంచి దీనికోసం దరఖాస్తు చేయొచ్చు.
  •  ఈ టాపప్‌ రుణానికీ వాహన రుణానికీ సాధారణ వాహన రుణానికి ఉండే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొన్నిసార్లు అరశాతం ఎక్కువా ఉండొచ్చు.
  •  ఇప్పటికే వాహన రుణాన్ని ఇచ్చిన బ్యాంకు దగ్గర మన కారు హామీగా ఉంటుంది. కాబట్టి, టాపప్‌ రుణానికి ప్రత్యేకంగా తనఖా అవసరం ఉండదు.
  • టాపప్‌ రుణం పొందడం సులభమే అయినా.. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నిబంధనలను గమనించాలి. కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణంగా పేర్కొంటూ.. 13-14 శాతం వరకూ వడ్డీని విధిస్తాయని గుర్తుంచుకోండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని