పిల్లల పేరిట ఎఫ్‌డీ

పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు

Updated : 22 Mar 2024 03:33 IST

పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారికి మున్ముందు అవసరమైన డబ్బును కూడబెట్టేందుకు వీలవుతుంది.

దీర్ఘకాలం పాటు సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకున్నప్పుడు ఎఫ్‌డీలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా వీటిని ప్రారంభిస్తే.. ఒక నిధిని జమ చేసేందుకు వీలవుతుంది. అది వారి చదువుల ఖర్చుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి బ్యాంకూ మైనర్ల కోసం ఎఫ్‌డీలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి మీ పిల్లల పేరుమీద ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించేందుకు ప్రయత్నించండి. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. పిల్లల పుట్టిన రోజు ధ్రువీకరణ, తల్లిదండ్రుల పాన్‌, చిరునామా వివరాల్లాంటివి సమర్పించాల్సి ఉంటుంది.

  •  పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఎఫ్‌డీని ప్రారంభించాలి. దీనివల్ల దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రయోజనంతో పెట్టుబడి వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.
  •  క్రమం తప్పకుండా డిపాజిట్‌ను సమీక్షిస్తూ ఉండాలి. వడ్డీ రేటు పెరిగినప్పుడు పాత డిపాజిట్‌ను రద్దు చేసి, కొత్త వడ్డీ రేటుకు తిరిగి ఎఫ్‌డీ చేయాలి.
  •  ఎఫ్‌డీలపై వచ్చిన వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తగిన ప్రణాళిక వేసుకోవాలి.
  •  వడ్డీని ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకోకుండా క్యుములేటివ్‌ ఎఫ్‌డీలను ఎంచుకోవాలి. దీనివల్ల వ్యవధి తీరిన తర్వాత అధిక మొత్తం వచ్చే అవకాశాలుంటాయి.
  • ఏటా కొంత మొత్తం కచ్చితంగా ఎఫ్‌డీ చేసేలా చూసుకోండి. పిల్లల ఆర్థిక అవసరాలకు తగినట్లుగా వ్యవధులను నిర్ణయించుకోండి. దీనివల్ల ఆ సమయంలో డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని