డెబిట్‌ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్‌బీఐ

డెబిట్‌ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Published : 29 Mar 2024 00:20 IST

డెబిట్‌ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

  • క్లాసిక్‌ డెబిట్‌ కార్డులు, సిల్వర్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై వార్షిక నిర్వహణ రుసుములను రూ.125 నుంచి రూ.200లకు పెంచింది.
  •  యువ, గోల్డ్‌, కాంబో డెబిట్‌ కార్డు, మై కార్డ్‌ల నిర్వహణ ఛార్జీలను రూ.175 నుంచి రూ.250కి చేర్చింది.
  •  ప్లాటినం డెబిట్‌ కార్డుల విభాగంలోని ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది.
  •  ప్లాటినం బిజినెస్‌ కార్డు ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగాయి. ఈ ఛార్జీలపై జీఎస్‌టీ అదనం.
  • ఎస్‌బీఐ కార్డ్‌ అందిస్తున్న ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపైనా కొన్ని కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని