ఉత్పత్తి రంగంలో మదుపు

దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది.

Published : 26 Apr 2024 00:05 IST

దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. ఈ సానుకూలత వచ్చే కొన్నేళ్ల పాటు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి రంగంలో అధిక వృద్ధిని నమోదు చేస్తున్న కంపెనీలపై పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ మానుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 10న ముగుస్తుంది. ఈ పథకానికి రాకేశ్‌ సేథియా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి బాటమ్‌ అప్‌ విధానాన్ని అనుసరిస్తారు. అటు వివిధ ఉత్పత్తి రంగాల్లోని అగ్రశ్రేణి కంపెనీలతో పాటు కొత్తగా అడుగు పెట్టి అనూహ్యమైన వృద్ధి సాధిస్తున్న కంపెనీలను సైతం పెట్టుబడి కోసం పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా దీర్ఘకాలంలో అధిక లాభాలు ఆర్జించాలనే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని