Fixed Deposits: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్‌ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు.

Published : 17 Feb 2024 18:59 IST

దిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధులపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లు 3% కనీస వడ్డీ పొందుతారు. ఇదే డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్స్‌ 3.50% వడ్డీ అందుతుంది. ఒక సంవత్సరం ఎఫ్‌డీపై డిపాజిటర్లు 6.70% పొందనుండగా, సీనియర్‌ సిటిజన్లు 7.20% వడ్డీ  అందుకుంటారు. 15 నెలల ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లు గరిష్ఠంగా 7.20% పొందనుండగా, సీనియర్‌ సిటిజన్లు ఇదే కాలవ్యవధి ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.75% వడ్డీని బ్యాంక్‌ చెల్లించనుంది. సవరించిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమల్లో ఉంటాయని బ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వర్తిస్తాయి. కనీస డిపాజిట్‌ రూ.10 వేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని