RD Rates: ఆర్‌డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్‌ చేసే వడ్డీ రేట్లు ఇవే..

దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్‌ డిపాజిట్‌ అందిస్తున్నాయి. ఈ ఆర్‌డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి.

Updated : 25 Apr 2024 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొదుపు అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేవి బ్యాంకులే. రిస్క్‌ లేని పెట్టుబడుల విషయానికొస్తే, ఈ బ్యాంకులు వినియోగదారులకు అందించే అనేక పొదుపు సేవల్లో ఆర్‌డీ సౌకర్యం ఒకటి. ఈ పెట్టుబడి పథకం కింద నిర్దిష్ట కాలానికి ప్రతి నెలా/త్రైమాసికానికి/అర్థమాసికానికి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్‌ చేయొచ్చు. క్రమ క్రమంగా డిపాజిట్‌ చెల్లించి గడువు తర్వాత వడ్డీ సహా పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు. పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించే అనుభవం లేని పెట్టుబడిదారులకు ఆర్‌డీలు మంచి ఎంపిక. పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం లేనప్పుడు క్రమంగా నిధిని నిర్మించడానికి ఆర్‌డీలు ఎంతో అనువైనవి.

మార్కెట్‌ హెచ్చు తగ్గులకు లోబడి ఉండే పెట్టుబడి ఎంపికల్లా కాకుండా, ఆర్‌డీ డిపాజిట్‌/వడ్డీకు బ్యాంకు గ్యారెంటీ ఉంటుంది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) ద్వారా గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ రక్షణ ఉంటుంది. కాబట్టి దీన్ని సురక్షిత పెట్టుబడిగా భావించొచ్చు. ఆర్‌డీపై రుణం కూడా తీసుకోవచ్చు. ఆర్‌డీలు పెట్టుబడిదారులలో క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంచుతాయి. సీనియర్‌ సిటిజన్స్‌ ఈ పెట్టుబడులపై సుమారు 0.5% అదనపు వడ్డీని పొందొచ్చు.

దేశంలోని వివిధ బ్యాంకులు ఆర్‌డీలపై సాధారణ డిపాజిటదార్లకు అందించే వడ్డీ రేట్లు కింది పట్టికలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు