Car Loans: ఎలక్ట్రిక్‌ కార్ల రుణాలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

కొన్ని ప్రధాన బ్యాంకులు మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి ఎలక్ట్రిక్‌ కార్ల రుణాలపై తగ్గింపు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి..

Published : 27 Jan 2024 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం సురక్షితమైన ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేసేవారికి నాలుగు ప్రధానమైన బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలందిస్తున్నాయి. ఎస్‌బీఐ ఎలక్ట్రిక్‌ కార్ల కోసం తగ్గింపు రేట్లతో రుణాన్ని అందజేస్తోంది. ఎస్‌బీఐలో రుణం తీసుకుని కొనుగోలు చేసే కస్టమర్లకు బ్యాంకు 20 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటును తగ్గిస్తోంది. జనవరి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా లేదు. ప్రస్తుత వడ్డీ రేటు 8.75% నుంచి 9.45% వరకు ఉంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఆధారంగా 9.15-12.25% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తోంది. .ముందస్తు చెల్లింపులపై జరిమానాను కూడా వసూలుచేయడం లేదు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు..‘పీఎన్‌బీ గ్రీన్‌ కార్‌’ (ఇ-వెహికల్‌) లోన్‌ అందిస్తోంది. వడ్డీ రేటు 8.75-9.75% వరకు ఉంది. ఈ రుణంపై బ్యాంకు ప్రాసెసింగ్‌ రుసుము, డాక్యుమెంటేషన్‌ ఫీజు వసూలు చేయడం లేదు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈ రుణాలపై 8.8-13 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఈ బ్యాంకు ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ కార్‌ లోన్‌ స్కీంపై ప్రాసెసింగ్‌ ఫీజు, డాక్యుమెంట్‌ ఛార్జీలను వసూలు చేయడం లేదు. ప్రీ-పేమెంట్‌, ప్రీ-క్లోజర్‌ చెల్లింపులపై అదనపు ఛార్జీలు కూడా లేవు. రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు, వృత్తి, వయసు ఆధారంగా రుణాల వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని