Home Renovation Loan: ఇంటి పునరుద్ధరణ రుణంపై వడ్డీ రేట్లు ఇవే..

ఇంటి పునరుద్ధరణకు అనేక రుణ సంస్థలు సరసమైన వడ్డీ రేట్లతో రుణాలిస్తున్నాయి, బ్యాంకులు ఎంత రుణానికి ఎంతెంత వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయో ఇక్కడ చూడండి.

Published : 25 Dec 2023 22:23 IST

ఇంటి పునరుద్ధరణ రుణాన్ని హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌/రెనోవేషన్‌ లోన్‌ అని కూడా పిలుస్తారు. ఇంటిని అప్‌గ్రేడ్‌ చేయడానికి లేదా రిపేర్‌ చేయడానికి రుణం కోరుకునే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే హోమ్‌ లోన్‌ తీసుకున్న రుణగ్రహీతలతో పాటు కొత్త వినియోగదారులు కూడా హోమ్‌ రెనోవేషన్‌ లోన్‌ను పొందొచ్చు. చాలా బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు, హౌసింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)లు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు సాధారణ ఇంటి రుణ వడ్డీ రేట్లకు సమానంగా లేదా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ రుణం తీసుకున్నవారు సెక్షన్‌ 24(బి) ప్రకారం ఆర్థిక సంవత్సరానికి రూ.30 వేల వరకు చెల్లించిన వడ్డీపై పన్ను మినహాయింపు క్లెయిం చేయొచ్చు. ఈ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజులు రుణ మొత్తంలో 0.25% నుంచి 2% మధ్యలో ఉంటాయి.

ఇంటి పునరుద్ధరణ రుణాలపై వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి.

(ఈ డేటా 2023, డిసెంబర్‌ 20 నాటిది)

గమనిక: ఈ పట్టికలో ఇంటి పునరుద్ధరణ రుణాలపై అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే తెలిపాం. క్రెడిట్‌ స్కోరు, వృత్తి, వయసు, రుణ మొత్తంపై ఆధారపడి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. మీ అర్హత, ఆస్తి విలువను బట్టి రుణ మొత్తం మారవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని