Fixed Deposits: NRO ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?

NRIలు ఇప్పుడు NRO ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీని సంపాదించొచ్చు.

Updated : 28 May 2024 14:34 IST

NRIలతో పాటు ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా(OCI), భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా బ్యాంకులో NRO ఖాతాను తెరవొచ్చు. వివిధ బ్యాంకులు ఈ NRO ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ప్రధానంగా భారతదేశంలో సంపాదించిన నిధులను నిర్వహించడానికి NRO ఖాతాను ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు NRI అయ్యుండి భారతదేశంలో ఆదాయ వనరు ఉంటే NRO ఖాతాను తీసుకుంటే మంచిది. ఆదాయంలో అద్దెలు, జీతం, ఆస్తి విక్రయాలు మొదలైనవి ఉండొచ్చు. డబ్బును విదేశీ, భారతీయ కరెన్సీలో కూడా డిపాజిట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. భారతీయ కరెన్సీలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. భారతదేశ రెసిడెంట్‌తో జాయింట్‌గా కూడా ఖాతాను కలిగి ఉండొచ్చు. ఈ ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించాలనుకుంటే..సమీప బ్యాంకు శాఖను సంప్రదించొచ్చు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా చేయొచ్చు. NRO ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు అనేక ఇతర దేశాల బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా మెరుగ్గా ఉంటున్నాయి.

NRO ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో ఉన్నాయి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని