Two Wheeler Loans: ద్విచ‌క్ర వాహ‌నాల రుణాలపై బ్యాంకులు వసూలుచేసే వ‌డ్డీ రేట్లు ఇవే..

ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై రుణసంస్థలు వసూలుచేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Updated : 07 May 2024 14:26 IST

ద్విచ‌క్ర వాహ‌నం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. 2024, ఏప్రిల్‌లో దాదాపు 16.76 లక్షల ద్విచక్ర వాహనాలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వాహ‌నాల కొనుగోలుకు విరివిగా రుణాలు అంద‌చేస్తున్నాయి. వాహ‌న కొనుగోలుదారులు బ్యాంక్ మొబైల్ యాప్‌/వెబ్‌సైట్ ద్వారా రుణ దర‌ఖాస్తు ఫారంను పూరించ‌వ‌చ్చు. లేదా బ్యాంకు శాఖ‌ను సంద‌ర్శించి రుణం కోసం దర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ చెల్లింపులు, రుణ నిబంధ‌న‌లు వంటి అన్ని విష‌యాల‌ను రుణం తీసుకునే ముందే స‌రిచూసుకోవాలి. చాలా బ్యాంకులు వాహ‌నం విలువ‌లో 80% నుంచి 90% వ‌ర‌కు రుణాన్ని ఇస్తాయి. కొన్ని బ్యాంకులు అద‌న‌పు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌తో 100% వరకు కూడా ఇస్తున్నాయి.

ద్విచక్ర వాహనాల రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి..

గ‌మ‌నిక: బ్యాంకులు అందిస్తున్న అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే ఇక్కడ తెలిపాం. వ‌డ్డీ రేటు..వ‌య‌స్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్‌, రుణం తీసుకునే వారి అర్హ‌త/అవ‌స‌రాల‌పై ఆధార‌ప‌డి మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని