Piyush Goyal: డెడ్‌లైన్స్ పనిచేయవు: అమెరికాతో వాణిజ్య చర్చలపై గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 02 Sep 2025 18:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందాలకు తాము సిద్ధమని భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూశ్‌ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చల (US Trade Negotiations) విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో మంత్రి స్పందించారు. డెడ్‌లైన్స్ పనిచేయవని తేల్చిచెప్పారు.

‘‘డెడ్‌లైన్స్ పెట్టుకొని మేం వాణిజ్య ఒప్పందాలపై ఎన్నడూ చర్చలు జరపబోం. ఇరువర్గాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందం కోసం మేం ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధమే’’ అని పరిశ్రమ వర్గాలతో జరిగిన కార్యక్రమంలో గోయల్‌ (Piyush Goyal) వెల్లడించారు. మార్చిలో మొదలైన భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. ఇప్పటివరకు ఐదు దఫాలుగా జరిగాయి. ఇవి జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మనపై సుంకాల మోత మోగించారు. దాంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్‌ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. ఈ తరుణంలో ఆరవ రౌండ్ చర్చలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. మరోపక్క భారత్‌ యూరోపియన్‌ యూనియన్‌ మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, గణనీయమైన పురోగతి ఉందని మంత్రి చెప్పారు. 

 వ్యవసాయ ఉత్పత్తుల (Agriculture Products)పై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. అందుకు ఆమోదిస్తే.. దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం అయినందున.. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్‌ ససేమిరా అంది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదే అగ్రరాజ్యం ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు, రష్యా నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోలును కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా (USA) ఒత్తిళ్ల మధ్య కూడా భారత్‌కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలవడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని